పవర్ ఫుల్ హగ్ అంటూ ఫోటో షేర్ చేసిన థమన్!

Published on Feb 20, 2022 9:40 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించిన సందర్భం నుండి సినిమా పై హైప్స్ మరింత గా పెరుగుతున్నాయి.

తాజాగా పవన్ కళ్యాణ్ మరియు థమన్ హగ్ చేసుకున్న ఫోటో ను మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. పవర్ ఫుల్ హగ్ అంటూ చెప్పుకొచ్చారు. సినిమా కోసం ఎంతగానో కష్టపడినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాక తన జీవితం లో ఇలాంటి క్షణాలను కలిగి ఉండటం పట్ల టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి థాంక్స్ తెలిపారు. అంతేకాక ఆ ఫోటో ను క్లిక్ చేసింది త్రివిక్రమ్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఫోటో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. భీమ్లా నాయక్ చిత్రం లో సంయుక్త మీనన్, నిత్య మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :