బాలయ్య సినిమాకి బాక్సులు బద్దలుగొట్టేస్తున్న థమన్.!

బాలయ్య సినిమాకి బాక్సులు బద్దలుగొట్టేస్తున్న థమన్.!

Published on Nov 25, 2022 10:00 AM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “వీర సింహా రెడ్డి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంని దర్శకుడు గోపీచంద్ మలేనినేని పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తుండగా ఇప్పుడు అయితే అభిమానులు అంతా కూడా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోసారి బాలయ్య మరియు థమన్ కాంబో నుంచి వస్తున్న “జై బాలయ్య” సాంగ్ ఇది కాగా దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే దీనిని మరింత ఎక్కించేలా థమన్ లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్ మంచి కేజ్రీగా మారింది. ఇప్పుడు జై బాలయ్య ట్యూన్ ఫైనల్ లిరికల్ వీడియో అండ్ ఫైనల్ ఆడియో చూడడం జరిగింది అని దెబ్బకి సౌండ్ వూఫర్ బద్దలయ్యిపోయింది అంటూ థమన్ ఓ ఫోటో షేర్ చేసి ఎగ్జైట్మెంట్ పెంచాడు. దీనితో సాంగ్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ ఉదయం 10 గంటల 29 నిమిషాలకి వచ్చే సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు