“వారిసు” సెకండ్ సింగిల్.. ఫుల్ ఫామ్ లో థమన్..!

“వారిసు” సెకండ్ సింగిల్.. ఫుల్ ఫామ్ లో థమన్..!

Published on Dec 4, 2022 4:30 PM IST


ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “వారిసు” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అయితే తమిళ్ సహా తెలుగులో కూడా భారీ అంచనాలు నెలకొల్పుకోగా ఈరోజు ఈ చిత్రం నుంచి ప్రముఖ స్టార్ట్ హీరో శింబు ఆలపించిన పవర్ ఫుల్ సెకండ్ సాంగ్ “థీ థలపతి” ని అయితే మేకర్స్ ఈరోజు రిలీజ్ చేశారు.

మరి ఈ సాంగ్ కి ముందు నుంచి ఇచ్చిన హైప్ కి తగ్గట్టే సంగీత దర్శకుడు థమన్ సాలిడ్ ట్యూన్ అండ్ బీట్ ని కుదిర్చాడు అని చెప్పాలి. సాంగ్ లో విజువల్స్ కూడా మంచి ఫైరింగ్ లో విజయ్ కి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ గా కనిపిస్తుండగా ఈ అంతటికీ మాత్రం థమన్ తన మ్యూజిక్ తో డెఫినెట్ గా విజయ్ ఫ్యాన్స్ కి అదిరే ట్రీట్ ని అందించాడని చెప్పడంలో సందేహమే లేదు. మరి లాస్ట్ రంజితమే కి కంప్లీట్ డిఫరెంట్ గా ఉన్న ట్యూన్ తో మాత్రం థమన్ మంచి ఫామ్ లో ఉన్నాడని చెప్పొచ్చు..

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు