పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించే బాధ్యత నుండి దేవిశ్రీ ప్రసాద్ తప్పుకోగా, ఆ స్థానంలో ఎస్.ఎస్.తమన్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ఈ హఠాత్ పరిణామం పవన్ అభిమానులను మరియు సినీ ప్రియులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ విషయంలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అప్పట్లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకు తమన్ మరియు సామ్ సి.ఎస్. కలిసి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది.
ఇక ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ కావడంతో ప్రేక్షకుల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇక విశేషమేమిటంటే, ఈ రెండు భారీ చిత్రాలను కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే నిర్మిస్తుండటం గమనార్హం. వరుసగా రెండోసారి కూడా మేకర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను మార్చి 19న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
