ప్లైట్‌లో “వకీల్‌సాబ్” సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న థమన్.!

Published on Oct 24, 2021 3:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్‌సాబ్’ సినిమా గత ఏడాది విడుదలై మంచి బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఫ్లైట్‌లో వెళ్తూ ఈ సినిమాను వీక్షించినట్టు ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు. ‘నేను ఫ్లైట్‌లో వకీల్ సాబ్ సినిమా చూస్తున్నానని, ఆ సినిమాలోని పదపద యువత? అనే లిరిక్‌ని పాడాడు.అంతేకాకుండా వకీల్ సాబ్ బీజీఎంను నవంబర్ 16న రిలీజ్ చేస్తానని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అయ్యాక చాలా రోజుల గ్యాప్ తర్వాత ‘వకీల్ సాబ్‌’ ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే అర డజన్‌కి పైగా సినిమాలను పవన్ లైన్‌లో పెట్టాడు. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ‘భీమ్లా నాయక్’, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చేస్తున్న పవన్, వీటి తర్వాత హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి చిత్రాల్లో నటించాల్సి ఉంది

సంబంధిత సమాచారం :