మరొకసారి మ్యాజిక్ చేయనున్న థమన్

Published on Oct 1, 2021 11:45 am IST

నాగ శౌర్య హీరోగా, రీతూ వర్మ హీరోయిన్ గా లక్ష్మీ సౌజన్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వరుడు కావలెను. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రతి చిన్న విషయం సైతం ఇండస్ట్రీ లో ఆసక్తి పెంచేస్తుంది. ఈ చిత్రం కి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుండి ఫన్ అండ్ పెప్పీ సాంగ్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

అక్టోబర్ 2 వ తేదీన వడ్డాణం అనే పాట ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. రేపు ఉదయం 10:08 గంటలకు పాటను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సైతం చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాటకి గానూ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరొకసారి థమన్ మ్యాజిక్ ఈ సినిమా కి ప్లస్ కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :