మహేష్ – థమన్ కాంబినేషన్‌లో మరో సినిమా!
Published on Nov 27, 2016 5:14 pm IST

mahesh-thaman
సూపర్ స్టార్ మహేష్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌లది అదిరిపోయే సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘దూకుడు’, ‘బిజినెస్‌మేన్’, ‘ఆగడు’ ఈ మూడు సినిమాల ఆడియోలు ఇప్పటికీ ఫేమస్. అలాంటి ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రానున్నట్లు చాలాసార్లే వినిపించినా, అవి కార్యరూపం దాల్చలేదు. తాజాగా మహేష్‌తో మరో సినిమాకు పనిచేసే అవకాశం తనకు దక్కిందని థమన్ తెలపడం విశేషంగా చెప్పుకోవాలి.

మహేష్‌తో త్వరలోనే ఓ సూపర్ మూవీకి పనిచేయబోతున్నట్లు థమన్ తెలిపారు. మరి ఆ సినిమా ఏమై ఉంటుందన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి మహేష్, మురుగదాస్ కాంబినేషన్‌లో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత కొరటాల శివతో చేయబోయే సినిమాకు దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఆ తర్వాత 25వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఆ సినిమాకు గోపీసుందర్ పనిచేస్తారని వినిపిస్తోంది. మరి ఇవి కాకుండా పూరీ జగన్నాథ్ – మహేష్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాకు థమన్ పనిచేస్తారా? లేదా వంశీ పైడిపల్లి సినిమాకే థమన్‌ను ఖరారు చేశారా? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!

 
Like us on Facebook