
ఇప్పటికే నవంబర్ 30వ తేదీన జరగనున్న ‘మేము సైతం’ ప్రోగ్రాం గురించి పలు స్పెషల్ అప్డేట్స్ ని మీకందిచాము. ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ ని మీకందిస్తున్నాం.. 30వ తేదీన జరగనున్న టెలీథాన్ ప్రోగ్రాంలో పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్స్, కమెడియన్స్ కలిసి పెర్ఫార్మన్స్ లు ఇవ్వనున్నారు. ఇదే వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా లైవ్ కాన్సెర్ట్ ఇవ్వడానికి సిద్దమవుతున్నారు. అందులో ప్రస్తుత టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన ఎస్ఎస్ థమన్ కూడా తన టీంతో లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నాడు.
తమన్ చేయనున్న లైవ్ కాన్సెర్ట్ లో స్పెషల్ ఏమిటంటే.. ఇప్పటి వరకూ తమన్ సినిమాలో అడపాదడపా పాటలు పాడిన హీరోలు స్టేజ్ పైకి వచ్చి తమన్ టీంతో కలిసి పాటలు పాడతారు. ఎన్.టి.ఆర్, రవితేజ, శింబు, మహేష్ బాబు లాంటి వారు పాటలు పాడారు. కావున ఈ హీరోలంతా స్టేజ్ పైన పాటలు పాడేలా తమన్ ప్లాన్ చేస్తున్నాడు. ఎన్నో ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్న మేము సైతం ప్రోగ్రాం నవంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకూ జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ని మీరు జెమిని టీవీలో లైవ్ గా చూడచ్చు.