మొన్న బాలయ్య, ఇప్పుడు ఎన్టీఆర్.. మ్యాజికల్ సినిమా కోసం బిగ్ ప్లాన్స్!

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి నెక్స్ట్ రానున్న పలు ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కూడా ఒకటి. దర్శకుడు శశాంక్ యేలేటి తెరకెక్కించిన ఈ మ్యాజికల్ ఎంటర్టైనర్ ఇటీవల వచ్చిన ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక ఈ ట్రైలర్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ తన వాయిస్ ఓవర్ అందించి సర్ప్రైజ్ చేశారు. ఇక ఈ తర్వాత మేకర్స్ మరో బిగ్ ప్లాన్ తో రాబోతున్నారు. తదుపరి జరగనున్న గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని తీసుకురావడం ఇప్పుడు ఖాయమైనట్టు తెలుస్తుంది.

ఇది మాత్రం సినిమాకి పెద్ద బూస్టప్ అని చెప్పొచ్చు. మొన్న బాలయ్య ఇప్పుడు ఎన్టీఆర్ లతో నందమూరి అభిమానులు ఇప్పుడు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఎలాగో రాజమౌళి సమర్పణలో వస్తుంది కాబట్టి ఇవన్నీ సాధ్యం అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక ఈ ఈవెంట్ తాలూకా డేట్ ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version