మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టార్డం అండ్ మార్కెట్ ఎలా ఉంటుందో మరోసారి ఇప్పుడు వచ్చిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారితో ప్రూవ్ అయ్యింది. చిరంజీవికి (Chiranjeevi) ఒక్క సరైన సినిమా పడితే చాలు దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కొన్నాళ్ల కితం వాల్తేరు వీరయ్య చూపిస్తే ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు చూపిస్తుంది.
అయితే మెగాస్టార్ సినిమాలకి భారీ ఆదరణ ముఖ్యంగా సాలిడ్ లాంగ్ రన్ ని అందించే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర కూడా ఒకటి. మామూలుగానే మెగా హీరోలకి అక్కడ క్రేజ్ ఎక్కువ. ఇక చిరంజీవి సినిమాకి కరెక్ట్ టాక్ పడితే ఆ లాంగ్ రన్ కూడా గట్టిగా ఉంటుంది. గతంలో వాల్తేరు వీరయ్య ఉత్తాంధ్రలో భారీ రన్ ని చూసింది. తెలుగు స్టేట్స్ లో ఎక్కడ కొంచెం డౌన్ అయినా కూడా అక్కడ మాత్రం మంచి నిలకడ కొనసాగింది.
సరిగ్గా ఇదే మళ్ళీ మన శంకర వరప్రసాద్ గారు కి చూపిస్తుంది. నిజానికి నిన్న సోమవారం బుకింగ్స్ అక్కడ అదిరే లెవెల్లో కనిపించాయి. ఉదయం చూసినా చాలా చోట్ల సెకండ్ షోస్ కూడా ఫుల్స్ పడ్డాయి. ఆ రేంజ్ లో ఈ సినిమా పెర్ఫామెన్స్ ఇప్పుడు కొనసాగుతుంది. ఇంతే కాకుండా గతంలో వాల్తేరు వీరయ్య ఎఫెక్ట్ తో ఇతర సినిమాలకి ఓవర్ ఫ్లోస్ ఎలా జరిగాయో ఇప్పుడు కూడా అదే పరిస్థితి అట. సో ఇలా ఉత్తరాంధ్రలో మాత్రం బాస్ ఊచకోత మామాలుగా లేదని చెప్పొచ్చు.
