‘తమ్ముడు’, ‘ధృవ’ ఇప్పుడు “గని”..వరుణ్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్.!

Published on Oct 27, 2021 3:03 pm IST


మన టాలీవుడ్ లో కొన్ని స్పెషల్ సాంగ్ ఎవర్ గ్రీన్ గా ఇప్పటికీ ఉన్నాయి. అలాంటి వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ అయ్యినటువంటి “తమ్ముడు” లో ట్రావెలింగ్ సోల్జర్ కూడా ఒకటి. అయితే దాని తర్వాత టాలీవుడ్ లో ఆ తరహా సాంగ్ కూడా చాలా వచ్చాయి కానీ దానిని భర్తీ చెయ్యలేదు. మళ్ళీ దానిని గుర్తు చేస్తూ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ “ధృవ” నుంచి టైటిల్ సాంగ్ వచ్చి మళ్ళీ మెగా ఫ్యాన్స్ కి ఆ వైబ్స్ ని తీసుకొచ్చింది.

ఇప్పుడు మళ్ళీ వీటి తరహాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమా “గని” నుంచి రిలీజ్ అయ్యిన లేటెస్ట్ సాంగ్ కూడా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సాంగ్ కి థమన్ ఇచ్చిన ఎనర్జిటిక్ మ్యూజిక్ బీట్స్ స్పెషల్ అట్రాక్షన్ కాగా ఈ సాంగ్ లో కొన్ని విజువల్స్ చూసాక వరుణ్ తేజ్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఈ విజువల్స్ చూసాక మాత్రం తమ్ముడు, ధృవ లోని సాంగ్స్ గుర్తు రాక మానవు.

ఆ సాంగ్స్ లో పవన్, రామ్ చరణ్ లు ఎలా అయితే మెస్మరైజ్ చేసారో వరుణ్ కూడా అలానే చేసాడు. దీనితో ఈ సినిమా కోసం తాను ఎంతలా హార్డ్ వర్క్ చేసాడో అన్నది కూడా అర్ధం అవుతుంది. మొత్తానికి మాత్రం గని నుంచి ఈ సాంగ్ ఇంప్రెసివ్ గా ఉంది. ఇక ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించగా సిద్ధూ ముద్ద – అల్లు బాబీ లు నిర్మాణం వహించారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More