6 రోజుల్లో ‘తండేల్’ సాలిడ్ కలెక్షన్స్

6 రోజుల్లో ‘తండేల్’ సాలిడ్ కలెక్షన్స్

Published on Feb 13, 2025 6:04 PM IST

అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’ బాక్సాఫీస్ దగ్గర ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి పూర్తి ప్రేమకథ చిత్రం గా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మేజర్ అసెట్‌గా మారడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.

చైతూ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్‌తో మొదలైన తండేల్ వసూళ్ల వర్షం 6 రోజులు దాటినా స్ట్రాంగ్‌గా వెళ్తుంది. తండేల్ చిత్రం 6 రోజుల థియేట్రికల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.86 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు వాలెంటైన్స్ డే వీకెండ్ కూడా కలిసి రానుండటంతో ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి తనదైన పర్ఫార్మెన్స్‌తో మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు