అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమానే “తండేల్”. యంగ్ అండ్ టాలెంటెడ్ నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ హై బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా బుకింగ్స్ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫ్లెడ్జ్ గా మొదలయ్యాయి.
మరి ఇంట్రెస్టింగ్ గా తండేల్ సినిమాకి డే 1 మొదటి ఆట నుంచి దాదాపు అన్ని చోట్ల సాలిడ్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. ఇది ఇంప్రెసింగ్ అంశం అని చెప్పాలి. అలాగే ఒక్క ఏపీ లోనే కాకుండా నైజాంలో కూడా తండేల్ బుకింగ్స్ లో దూకుడు కనబరుస్తుండడం విశేషం. దీనితో తండేల్ సినిమాకి సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా బన్నీ వాసు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
