అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ ప్రేమకథ చిత్రం ‘తండేల్’ గత వారం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాలోని కథ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.
ఈ సినిమాకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవ్వడం తో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో లో ఓ రేర్ ఫీట్ అందుకుంది. తండేల్ చిత్రానికి బుక్ మై షో లో ఏకంగా 1 మిలియన్ టికెట్లు బుక్ అయినట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇలా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ‘తండేల్’ నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా బన్నీ వాస్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.