అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “తండేల్”. టాలెంటెడ్ యువ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా వచ్చింది. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా నాగ చైతన్య కెరీర్లో మంచి హైప్ ఉన్న సినిమాగా ఎట్టకేలకు నేడు థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.
అయితే తెలుగు స్టేట్స్ లో సహా ఓవర్సీస్ మార్కెట్ లో తండేల్ మంచి బుకింగ్స్ ని కనబరిచింది. ఇలా ఓవరాల్ ట్రెండ్ లో అయితే సాలిడ్ ఓపెనింగ్స్ ఈ సినిమాకి దక్కొచ్చని తెలుస్తోంది. దీనితో ఈ సినిమా మొదటి రోజు 20 కోట్ల మేర గ్రాస్ ని అందుకుంటుంది అని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరి ట్రేడ్ లో కూడా ఇదే తరహా టాక్ నడుస్తోంది. మరి చూడాలి తండేల్ రాజు ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటాడు అనేది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు అలాగే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.