యూఎస్ లో సాలిడ్ ఓపెనింగ్స్ తో “తండేల్”

యూఎస్ లో సాలిడ్ ఓపెనింగ్స్ తో “తండేల్”

Published on Feb 7, 2025 8:57 AM IST

లేటెస్ట్ గా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ సినిమా “తండేల్” కోసం తెలిసిందే. యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చింది. అయితే మన దగ్గర మాత్రమే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా సాలిడ్ ఓపెనింగ్స్ తో తండేల్ ఇపుడు అదరగొడుతుంది.

మరి యూఎస్ లో ఈ సినిమా ఆల్రెడీ కేవలం ప్రీమియర్స్ తోనే 2 లక్షలకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టుగా డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. దీనితో తండేల్ రెస్పాన్స్ అదిరింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలాగే బన్నీ వారు నిర్మాణం వహించగా దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు