‘తండేల్’ నుంచి సాలిడ్ అప్డేట్‌కు టైమ్ ఫిక్స్

‘తండేల్’ నుంచి సాలిడ్ అప్డేట్‌కు టైమ్ ఫిక్స్

Published on Jan 16, 2025 9:02 PM IST

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమా నుంచి రాబోయే ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను జనవరి 17న ఉదయం 11.07 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీనికి సంబంధించి ఓ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇక ఈ అప్డేట్ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా GA2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు