శ్రీ‌కాకుళం షూటింగ్ ముగించుకున్న ‘తండేల్’

శ్రీ‌కాకుళం షూటింగ్ ముగించుకున్న ‘తండేల్’

Published on Jun 22, 2024 8:00 PM IST

యంగ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’ ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు చందు మొండేటి తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టిస్తుండ‌టంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా, ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్ శ్రీ‌కాకుళంలో జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌కాకుళంలో జరిగిన కొన్ని య‌దార్థ సంఘ‌ట‌నల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీంతో ఈ చిత్ర షూటింగ్ ను శ్రీ‌కాకుళంలో నిర్వ‌హిస్తున్నారు. అయితే, నేడు శ్రీ‌కాకుళం షెడ్యూల్ కు సంబంధించిన షూటింగ్ ను చిత్ర యూనిట్ ముగించుకుంది.

ఈ షెడ్యూల్ లో ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ను చిత్ర యూనిట్ షూట్ చేసింది. జాల‌ర్ల‌కు సంబంధించిన జీవ‌న విధానంపై ఈ సినిమా క‌థ న‌డుస్తుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌గా GA2 పిక్చర్స్ బ్యాన‌ర్ పై బ‌న్నీ వాస్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు