టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నాగ చైతన్య తండేల్ చిత్రం తో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని ఆశిస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకునే టైమ్ కి కొంత కాలం పడుతుంది. అయితే సరిగ్గా దసరా పండుగకి సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరొక పక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర పార్ట్ 1 కూడా అక్టోబర్ లో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తండేల్ కంటెంట్ పై మేకర్స్ కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఈ రెండు చిత్రాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో దిగుతాయా? లేదా? తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. దేవర చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.