అక్కడ హాఫ్ మిలియన్ కి చేరువలో “తండేల్” రాజు

అక్కడ హాఫ్ మిలియన్ కి చేరువలో “తండేల్” రాజు

Published on Feb 9, 2025 1:00 AM IST

యువ హీరో హీరోయిన్స్ అక్కినేని నాగ చైతన్య అలాగే సాయి పల్లవి లీడ్ రోల్స్ లో దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “తండేల్”. మరి థియేట్రికల్ గా నాగ చైతన్య సాలిడ్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది ఒక ట్రీట్ గా వచ్చి దుమ్ము లేపింది.

మరి ఈ సినిమా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా స్ట్రాంగ్ వసూళ్లు ఈ చిత్రం అందుకోగా ఇపుడు అక్కడ నాలుగు లక్షల డాలర్స్ మార్క్ ని దాటేసి హాఫ్ మిలియన్ డాలర్స్ మార్క్ దిశగా దూసుకెళ్తుంది.

దీనితో వీకెండ్ పూర్తయ్యేసరికి 1 మిలియన్ దగ్గరలోకి వచ్చినా కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు. అలాగే అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు