యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’పై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి పూర్తి ప్రేమకథ చిత్రంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి నెలకొంది.
ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌ను శరవేగంగా జరుపుకుంటున్నారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.90 కోట్లకు క్లోజ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. నాగచైతన్య కెరీర్‌లోనే ఇది హయ్యెస్ట్ అని చెప్పొచ్చు.
ఈ సినిమాతో నాగచైతన్య బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకోవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.