రేపు “తండేల్” నుండి సాయి పల్లవి స్పెషల్ వీడియో రిలీజ్!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ తండేల్ (Thandel). చందూ మొండేటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుండగా, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. రేపు సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ రేపు స్పెషల్ వీడియోను ఉదయం 09:09 గంటలకి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. పోస్టర్ లో సాయి పల్లవి లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడం తో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version