లేటెస్ట్ గా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన అవైటెడ్ ప్రేమ కథా చిత్రం “తండేల్” కూడా ఒకటి. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం సాలిడ్ ఓపెనింగ్స్ ని వరల్డ్ వైడ్ అందుకుంది.
అయితే మొదటి రోజు 21 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా ఇపుడు రెండో రోజు కూడా సెన్సేషనల్ బుకింగ్స్ స్ట్రాంగ్ వసూళ్లు అందుకుంది. ఇలా డే 2 కి కూడా మొత్తం 20 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు అందుకొని ఈ రెండు రోజుల్లో మొత్తం 41.2 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
దీనితో రెండో రోజు కూడా డే 1 తరహాలోనే రావడం అనేది సెన్సేషనల్ అని చెప్పాలి. ఇక తండేల్ రాజు లెక్క ఎక్కడ ఆగుతుందో వేచి చూడాల్సిందే. మరి ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ బ్యూటిఫుల్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మాణం వహించారు.
#BlockbusterThandel collects ????????.???????? ???????????????????????? ???????????????????? ???????????????????????????????????? in 2 days ❤️????
???????????? ???? >> ???????????? ???? ???????? ???????????? ???????????????????????? ???????????????????????? ????
A super strong day 3 loading ????????Book your tickets for #Thandel now!
????️ https://t.co/5Tlp0WNszJ… pic.twitter.com/E0XuY3A9ml— Thandel (@ThandelTheMovie) February 9, 2025