అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “తండేల్. మరి, కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా సాలిడ్ ఎమోషన్స్ తో వచ్చి ఆడియెన్స్ ని మెప్పించింది. ఇలా లేటెస్ట్ గా తెలుగు రాష్ట్రాల్లోని మాత్రమే కాకుండా యూఎస్ లో కూడా ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు రాబడుతుంది.
ఇలా లేటెస్ట్ గా యూఎస్ లో హాఫ్ మిలియన్ మార్క్ ని ఈజీగా దాటేసి ఇపుడు 6 లక్షల డాలర్లు మార్క్ దిశగా దూసుకెళ్తుంది. దీనితో తండేల్ అక్కడ మాత్రం సాలిడ్ రన్ ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. అలాగే ఈ వీకెండ్ కి 1 మిలియన్ దగ్గరలో ఏమన్నా ఆగుతుంది అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు అలాగే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.