అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “తండేల్”. పలు నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా మొదటి షో తోనే సాలిడ్ హిట్ టాక్ తెచ్చుకొని అదరగొట్టింది. అయితే రిలీజ్ కి ముందు రోజు నుంచే తెలుగు స్టేట్స్ లో స్ట్రాంగ్ బుకింగ్స్ ని నమోదు చేసిన ఈ సినిమా ఇపుడు నైజాం మార్కెట్ లో డే 1 దుళ్లకొట్టేసినట్టు తెలుస్తుంది.
ఇలా మొదటి రోజు అక్కడ 3.2 కోట్ల షేర్ ని అందుకున్నట్టుగా పిఆర్ లెక్కలు చెబుతున్నాయి. అలాగే ఈ వీకెండ్ కి సాలిడ్ మార్క్ ఎనిమిదిన్నర కోట్లకి పైగా మార్క్ ని తండేల్ టచ్ చేస్తుంది అని ట్రేడ్ వర్గాల అంచనా. దీనితో సాలిడ్ స్టార్ట్ ఈ చిత్రానికి దక్కింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా బన్నీ వాసు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.