అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్’. ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెల ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఐతే, తాజా సమాచారం ప్రకారం తండేల్ మలయాళ వెర్షన్ ను తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లతో పాటు ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ అప్ డేట్ కి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మొత్తానికి, ఈ తండేల్ చిత్రం పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. కోలీవుడ్ లో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీం వారియర్ పిక్చర్స్ వారు సొంతం చేసుకున్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ నటీనటులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. నాగచైతన్య – సాయి పల్లవి జంటగా రాబోతూ ఉండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలను ఈ చిత్రం ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.