“తండేల్” జాతర.. మొదటి వారం వసూళ్లు ఎంతంటే!

“తండేల్” జాతర.. మొదటి వారం వసూళ్లు ఎంతంటే!

Published on Feb 14, 2025 2:59 PM IST

అక్కినేని యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యువ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన లేటెస్ట్ హిట్ చిత్రమే “తండేల్”. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ని మొదటి ఆట నుంచే మెప్పించి సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. మరి ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లో కూడా సాలిడ్ నంబర్స్ అందుకున్న ఈ సినిమా ఇపుడు మొదటి వారం రోజుల రన్ ని థియేటర్స్ లో కంప్లీట్ చేసుకుంది.

మరి ఈ వారం రోజుల్లో తండేల్ సాలిడ్ నెంబర్ దగ్గర ఆగింది అని చెప్పాలి. ఈ వారం రోజుల్లో తండేల్ సినిమా 90 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా మేకర్స్ చెబుతున్నారు. దీనితో నాగ చైతన్య కెరీర్లో మొదటి 100 కోట్ల సినిమాగా ఈ సినిమా స్యూర్ షాట్ అనేది పక్కా అయిపోయింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా బన్నీ వాసు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు