థ్యాంక్యూ విక్కీ – కత్రినా. కంగ్రాట్స్‌ – కంగనా

Published on Dec 12, 2021 6:13 pm IST

బాలీవుడ్‌ కొత్త జంట కత్రినాకైఫ్‌, విక్కీ కౌశల్‌ తమ పెళ్లికి వచ్చిన అతిథులకూ స్పెషల్‌ గిఫ్ట్ బాక్స్‌ పంపించారు. అతిథులు విడిది చేసిన రూమ్స్‌లో ముందుగానే ఈ గిఫ్ట్‌ బాక్స్ పెట్టారు. ఇంతకీ స్పెషల్‌ గిఫ్ట్ బాక్స్‌ లో ఏమేమి ఉన్నాయంటే.. నాలుగు రకాల పంజాబీ స్వీట్స్‌, థ్యాంక్యూ లెటర్‌. ఆ లెటర్ లో ఈ విధంగా మెసేజ్ ఉంది. ‘మా ఆహ్వానాన్ని మన్నించి సుదూర ప్రయాణం చేసి మా పెళ్లి వేడుకల్లో భాగమైన మీ అందరికీ ధన్యవాదాలు’ అంటూ సాగింది ఈ మెసేజ్.

అయితే, వీరి పెళ్లికి బాలీవుడ్ వివాదాల హీరోయిన్ కంగనా రనౌత్‌ కూడా వెళ్ళింది. ఆమెకు కూడా ఈ స్పెషల్‌ గిఫ్ట్ బాక్స్ అందింది. దాంతో కంగనా రనౌత్‌ కొత్త జంట కత్రినాకైఫ్‌, విక్కీ కౌశల్‌ లకు కంగ్రాట్స్‌ చెబుతూ ఒక మెసేజ్ పోస్ట్ చేసింది. కంగనా ‘‘సువాసనతో కూడిన పువ్వులు, రుచికరమైన నేతి లడ్డూలు పంపించినందుకు థ్యాంక్యూ విక్కీ-కత్రినా. కంగ్రాట్స్‌’’ అని పోస్ట్ పెట్టింది.

సంబంధిత సమాచారం :