‘వ్య‌వ‌స్థ’ సిరీస్‌ను ఇంతగా ఆద‌రిస్తోన్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌ – సక్సెస్ మీట్‌లో హీరో సందీప్ కిష‌న్‌

Published on May 17, 2023 11:34 pm IST

ఎప్పటికప్పుడు ఆడియన్స్ కి వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తూ వారి హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్య‌మం జీ 5. తాజాగా వారి స్ట్రీమింగ్ లైబ్ర‌రీలో చేరిన ఒరిజిన‌ల్ సిరీస్ వ్యవస్థ. ఈ థ్రిల్లింగ్ కోర్టు రూమ్ డ్రామా ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటూ దూసుకెళ్తోంది. ఆనంద్ రంగ దర్శకత్వం వహించటంతో పాటు పట్టాభి చిలుకూరితో కలిసి రూపొందించారు. ఇప్ప‌టికే 150 మిలియ‌న్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించి దూసుకెళ్తోంది. ఈ సంద‌ర్బంగా వ్య‌వ‌స్థ టీమ్ స‌క్సెస్ మీట్‌ను నిర్వ‌హించింది. హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవస్థలో వర్క్ చేసిన వారందరరూ చాలా కావాల్సిన వారే. సంపత్‌గారితో క‌లిసి సినిమా చేయాల‌ని ఎదురు చూస్తున్నాను. అలాగే కామ్నా జెఠ్మ‌లానీతో నేను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి ప‌రిచ‌యం ఉంది. హెబ్బా ప‌టేల్‌కి కంగ్రాట్స్. కార్తీక్ ర‌త్నం అంటే చాలా ఇష్టం. త‌ను వ్య‌వ‌స్థ‌లో పోషించిన తీరు అద్భుతం. జీ5కి అభినంద‌న‌లు. వారు కంటెంట్‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే తీరు బావుంది. ఇక ద‌ర్శ‌కుడు ఆనంద్ రంగ‌గారితో డీకే బోస్ చిత్రం నుంచి ప‌రిచ‌యం ఉంది. వ్య‌వ‌స్థ సినిమాను ఎలా తెర‌కెక్కించారా అని వెయిట్ చేసి చూశాను. ఎంటైర్ టీమ్‌కి కంగ్రాట్స్‌. 150 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌తో ఆద‌రిస్తోన్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. ఈ టీమ్ రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్ లతో ఆడియన్స్ ని ఆకట్టుకోవాలని కోరుతూ అందరికీ అభినందనలు తెలిపారు సందీప్ కిషన్.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :