లేటెస్ట్: చైతూ “థాంక్యూ” టీజర్ రిలీజ్ కి రెడీ!

Published on May 23, 2022 6:05 pm IST


అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ థాంక్యూ. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని దిల్ రాజు మరియు శిరీష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విడుదలైన పలు ప్రచార చిత్రాలు సినిమా పై అంచనాలను పెంచేశాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ను మే 25 సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఒక వీడియో ద్వారా వెల్లడించారు. ఈ వీడియో లో నాగ చైతన్య లుక్ సూపర్ కూల్ గా ఉంది. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ పై క్లారిటీ రావడం తో ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 8, 2022 న భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :