లోకేష్ కనగ్ రాజ్ సినిమాలో విజయ్ ఇలా కనిపిస్తాడా..?

లోకేష్ కనగ్ రాజ్ సినిమాలో విజయ్ ఇలా కనిపిస్తాడా..?

Published on Jul 3, 2022 9:09 PM IST


తాజాగా సౌత్ ఇండియన్ సినిమా దగ్గర భారీ హిట్ గా నిలిచిన లేటెస్ట్ చిత్రం “విక్రమ్” కోసం అందరికీ తెలిసిందే. లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ ల కాంబోలో వచ్చిన ఈ చిత్రం భారీ హిట్ గా నిలిచింది. మరి ఈ సినిమా తర్వాత లోకేష్ కనగ్ రాజ్ నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయా అని చూస్తుండగా తానే మళ్ళీ నెక్స్ట్ దళపతి విజయ్ తో సినిమాని కన్ఫర్మ్ చేసాడు.

ఇక ఇప్పుడు ఈ సినిమాలో విజయ్ రోల్ పై ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రంలో విజయ్ ఒక గ్యాంగ్ స్టర్ లా కనిపిస్తాడట. ఇందులో కూడా డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ తన బిగిల్ సినిమాలో రాజప్ప లాంటి సాలిడ్ గ్యాంగ్ స్టర్ లా కనిపిస్తాడని తమిళ సినీ వర్గాలు నుంచి టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు