తన డ్రీమ్ రోల్ గురించి తాప్సి ఇంట్రస్టింగ్ కామెంట్స్…!!

Published on Jul 6, 2022 9:30 pm IST

సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఎంతో సెలెక్టీవ్ గా పాత్రలు ఎంచుకుంటూ కొనసాగుతున్న వారిలో యువ నటి తాప్సి ఒకరు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఝుమ్మంది నాదం మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు తాప్సి. ఈ మూవీలో తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకున్న తాప్సి అక్కడి నుండి వరుసగా అవకాశాలతో దూసుకెళ్లారు. అటు హిందీలో కూడా పలు సినిమాలు చేస్తూ సక్సెస్ లు, క్రేజ్ సొంతం చేసుకున్న తాప్సి లేటెస్ట్ గా చేస్తున్న మూవీ శభాష్ మిథు.

ప్రముఖ లేడీ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ జులై 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్న తాప్సి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా తన డ్రీమ్ రోల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. తనకు మొదటి నుండి అవెంజర్స్ లో ఒక సూపర్ హీరో పాత్ర చేయాలని ఉందన్నారు. అయితే అవెంజర్స్ లో ఇప్పటికే వచ్చిన హీరోల పాత్రలో కాకుండా ఒక ఇండియన్ సూపర్ హీరో పాత్ర చేయాలని ఉందని తెలిపారు. అయితే అటువంటి అవకాశము ఎప్పుడు వచ్చినా చేయడానికి సిద్ధం అని అన్నారు. మరోవైపు ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ధున్కి తో పాటు సమంత తో కలిసి మరొక మూవీ కూడా చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత సమాచారం :