ENE2 అంచనాల ఒత్తిడితో సచ్చిపోతున్నా – తరుణ్ భాస్కర్

ENE-2

టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన యూత్‌ఫుల్ చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది..?’ ప్రేక్షకుల్లో ఎలాంటి కల్ట్ ఫాలోయింగ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని కంటెంట్ ఎవర్‌గ్రీన్ కామెడీతో ఉండటం ఈ సినిమాను ఇప్పటికీ హాట్ ఫేవరెట్‌గా మార్చింది. అయితే, ఈ క్రేజీ సినిమాకు సీక్వెల్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ENE2 ప్రాజెక్ట్ తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై అంచనాలు అప్పుడే భారీగా క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా కోసం యూత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఇన్‌స్టాలో కొందరు యువకులు ఈ క్రేజీ డైరెక్టర్ కమ్ ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం గురించి చర్చించుకుంటూ ఓ వీడియ చేశారు. దీంతో తరుణ్ భాస్కర్ వారి వీడియోకు రిప్లై ఇస్తూ ENE2 సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో ఒత్తిడి వల్ల తాను సచ్చిపోతున్నా అంటూ కామెంట్ చేశాడు.

ప్రస్తుతం ఈ వడియో ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది. మొత్తానికి ఈ నగరానికి ఏమైంది 2 చిత్రం కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో.. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఏర్పడ్డాయో అర్థం చేసుకోవచ్చు.

Exit mobile version