‘మట్కా’ నుంచి ‘తస్సాదియ్యా’ లిరికల్ సాంగ్ రిలీజ్!

‘మట్కా’ నుంచి ‘తస్సాదియ్యా’ లిరికల్ సాంగ్ రిలీజ్!

Published on Oct 24, 2024 6:01 PM IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పీరియాడిక్ డ్రామా మూవీగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరికొత్త గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అయ్యింది.

ఇక ఈ సినిమా నుంచి తాజాగా ‘తస్సాదియ్యా’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను పూర్తిగా రెట్రో వెర్షన్‌లో కంపోజ్ చేశారు. భాస్కరభట్ల అందించిన లిరిక్స్‌కు సింగర్ మనో తనదైన స్టయిల్‌తో పాడారు. ఇక జీవీ.ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం ఈ పాటకు బలంగా మారింది. ఈ పాటలో వింటేజ్ రెట్రో లుక్స్‌తో వరుణ్ తేజ్ అభిమానులని ఆకట్టుకున్నాడు.

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయగా, నవంబర్ 14న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు