టాక్..”ఎన్టీఆర్ 30″ పై బిగ్ అప్డేట్ ఆరోజే..?

Published on May 10, 2022 1:20 pm IST


టాలీవుడ్ మాస్ హీరోస్ లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా నటించిన “రౌద్రం రణం రుధిరం” తో ఆకట్టుకున్నారు. ఆ చిత్రంలో కొమురం భీమ్ పాత్ర చేసి పాన్ ఇండియా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ తన హిట్ డైరెక్టర్ అయినటువంటి కోరల శివతో ఒక భారీ పాన్ ఇండియా సినిమాకి సిద్ధం అవుతున్నాడు.

అయితే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొనగా అభిమానులు అయితే చాలా ఆసక్తిగా ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మే 20న తారక్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు కోసమే ఆసక్తిగా చూస్తున్నారు. అయితే మరి ఆ బిగ్ డే కే ఓ బిగ్ అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేస్తున్నట్టు గట్టి టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఆ అప్డేట్ ఏంటి అనేది మాత్రం వేచి చూడాలి. మరి ఈ భారీ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :