NBK 108 లో హీరోయిన్ గా ఆ స్టార్ నటి ఫిక్స్ అట ?

NBK 108 లో హీరోయిన్ గా ఆ స్టార్ నటి ఫిక్స్ అట ?

Published on Feb 2, 2023 12:52 AM IST


ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీర సింహా రెడ్డి మూవీతో కెరీర్ పరంగా పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ వ్యయంతో నిర్మించగా థమన్ సంగీతం అందించారు. ఇక ఆ సినిమా సక్సెస్ యొక్క జోష్ తో ప్రస్తుతం యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో తన తదుపరి మూవీ చేస్తున్నారు బాలకృష్ణ.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుండగా దీనికి థమన్ సంగీత అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై భారీ వ్యయంతో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా ప్రముఖ టాలీవుడ్ స్టార్ నటి కాజల్ అగర్వాల్ ని తీసుకునున్నట్లు ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు రాగా, లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఆమెను ఫైనల్ గా హీరోయిన్ గా తీసుకోవాలని యూనిట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా తన మార్క్ అంశాలతో పాటు బాలకృష్ణ స్టైల్ మాస్ యాక్షన్ ని కూడా కలగలిపి దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు