ఆ హీరో చరణ్ కు బ్రదర్ గా నటిస్తున్నాడు !


ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ తన కొత్త సినిమా ప్రారంభించాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ను డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తమిళ్ హీరో ప్రశాంత్ రామ్ చరణ్ కు అన్నయ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

ప్రశాంత్ గతంలో శంకర్ దర్శకత్వం వహించిన జీన్స్ సినిమాలో హీరోగా నటించాడు. బోయపాటి, చరణ్ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతోంది. కైరాఅద్వాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. జయ జానకి నాయక సినిమా తరువాత బోయపాటి శ్రీను ద్ఫర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇదే. చరణ్ తో బోయపాటి గతంలోనే సినిమా చెయ్యాలి కాని ఇప్పుడు కుదిరింది. మంచి కథ, కథనాలతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.