మహాలక్ష్మి వెడ్డింగ్ సాంగ్ తో వచ్చేసింది !

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తమన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దటీజ్ మహాలక్ష్మి’. హిందీలో కంగనా రనౌత్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘క్వీన్’ రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించిన చిత్రీకరణ పూర్తియి పోస్ట్ ప్రోడుక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది.

కాగా తాజాగా ఈ చిత్రం వెడ్డింగ్ సాంగ్ లిరికల్ వీడియో విడుదల అయింది. మా ఇంట్లో కళ్యాణానికి మీరందరూ రావాలి. మహాలక్ష్మి వెడ్డింగ్ సాంగ్ లిరికల్ వీడియో ఇదిగో మీకోసం’ అంటూ తమన్నా తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ సాంగ్ ని పోస్ట్ చేసింది. సాంగ్ ప్రస్తుతం నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version