రామ్ ‘స్కంద’ లో అవే మెయిన్ హైలైట్ అట ?

Published on Sep 23, 2023 5:07 pm IST


యంగ్ హీరో రామ్ పోతినేని తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ స్కంద. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రలో సాయి మంజ్రేకర్ కనిపించనున్నారు. సెప్టెంబర్ 28న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో దగ్గుబాటి రాజా, ఇంద్రజ, గౌతమి, ప్రభాకర్, శ్రీకాంత్, ప్రిన్స్, శరత్ లోహితస్వ నటిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అందరిలో మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచిన స్కంద లో మొత్తం ఐదు యాక్షన్ ఎపిసోడ్స్ ఉండగా అవి సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ముఖ్యంగా బోయపాటి శ్రీను సినిమాల్లో యాక్షన్ సీన్స్ అదిరిపోతాయనేది తెలిసిందే. తొలిసారిగా రామ్ కూడా ఈ స్థాయి భారీ యాక్షన్ సీన్స్ చేస్తుండడంతో దర్శకుడు బోయపాటి మరింత కేర్ తీసుకుని తెరకెక్కించారట. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన స్కంద రిలీజ్ అనంతరం ఎంత మేర సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడలి.

సంబంధిత సమాచారం :