ప్రభాస్ ‘ప్రాజెక్ట్ – కె’ కి సంబంధించి ఆ న్యూస్ నిజం కాదట ?

ప్రభాస్ ‘ప్రాజెక్ట్ – కె’ కి సంబంధించి ఆ న్యూస్ నిజం కాదట ?

Published on Feb 2, 2023 3:01 AM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్వినీదత్ ఎంతో భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ప్రాజక్ట్ కె. మొదటి నుండి అందరిలో ఈ క్రేజీ మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర చేస్తున్న ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా డానీ శాంచెజ్ లోపెజ్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు.

మహానటి ఫేమ్ నాగ అశ్విన్ ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీకి సంబంధించి రెండు రోజులుగా ఒక న్యూస్ ప్రచారంలో ఉంది. ఈ మూవీని డైరెక్టర్ నాగ అశ్విన్ రెండు భాగాలుగా తీసేందుకు సిద్ధం అయ్యారని వార్త వచ్చింది. అయితే తాజా టాలీవుడ్ బజ్ ప్రకారం ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, ప్రాజక్ట్ కె మూవీ కేవలం ఒకటే సినిమాగా తెరకెక్కనుందని అంటున్నారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2024 ప్రథమార్ధంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు