రామ్ చరణ్ RC 15 కి సంబంధించి ఆ న్యూస్ నిజమే ?

Published on Mar 9, 2023 2:30 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న RC 15 మూవీ భారీ యాక్షన్ తో కూడిన పొలిటికల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీని దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈమూవీలో రామ్ చరణ్ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండనుందట.

అలానే కీలక పాత్రలో నటిస్తున్న శ్రీకాంత్ క్యారెక్టర్ కి సినిమాలో ఎంతో ఇంపార్టెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది .ఇక విషయం ఏమిటంటే, నిజానికి ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నారు అనే వార్త ఎప్పటినుండో పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. అయితే అది పక్కాగా నిజమే అని తెలుస్తోంది. కాగా సినిమాలో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రెండవ పాత్రకి జోడీగా అందాల నటి అంజలి కనిపించనున్నారు అనేది నిజమని లేటెస్ట్ టాలీవుడ్ స్ట్రాంగ్ బజ్. అయితే పక్కాగా దీనిపై మూవీ యూనిట్ నుండి మాత్రం అఫీషియల్ గా వివరణ రావాల్సి ఉంది. మరోవైపు ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :