That One Penguin: వైరలవుతున్న పెంగ్విన్ కథని ఎప్పుడో చెప్పిన పూరీ.!

That One Penguin

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘ఆ ఒక్క పెంగ్విన్’ (That One Penguin) కోసమే అంతా మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ పెంగ్విన్ ఏంటి? ఎందుకు ఆకస్మికంగా వైరల్ గా మారింది. ఎప్పుడో 15 ఏళ్ల కితం వీడియో ఇప్పుడు వైరల్ గా మారడం ఏంటి? దీనికి మన టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పిన బ్యాక్ స్టోరీ ఏంటి అనేవి చూద్దాం.

15 ఏళ్ల కితం వీడియో ఇప్పుడు వైరల్?

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎటు చూసినా ఓ వీడియోలో రెండు పెంగ్విన్ లు ఉంటే ఒక పెంగ్విన్ అక్కడే ఆగిపోయింది కానీ మరో పెంగ్విన్ మాత్రం అలా మంచుపై ఓ కొండ వైపు నడుచుకుంటూ సీరియస్ గా వెళ్ళిపోతుంది. అయితే ఇది చూసేందుకు చాలామందికి ముందు అర్ధం కాకపోవచ్చు కానీ తర్వాత కామెడీ చేసుకున్నారు. ఇప్పటికీ అలానే వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది. అయితే చాలామంది 15 ఏళ్ళు కితం వీడియో అనుకుంటున్నారు కానీ ఇది అంతకంటే పాతది. 2007లో ‘ఎన్కౌంటర్స్ ఆఫ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్’ అనే డాక్యుమెంటరీ సినిమా లోనిది అట. దీనిని వెర్నర్ హెర్జోడ్ అనే దర్శకుడు దీనిని చిత్రీకరించారట.

ఈ పెంగ్విన్ స్టోరీ వెనుక విషాదాన్ని వివరించిన పూరి జగన్నాథ్

ఈ పెంగ్విన్ పక్షి ఎందుకు అలా వెళ్ళిపోతుంది అనేది చాలామందికి అర్ధం కాలేదు. వెళితే నీటిలోకి వెళ్ళాలి కానీ ఏవి లేని దిశగా కొండ వైపు ఆగకుండా వెళ్ళిపోతుంది. అయితే దీని వెనుక చాలానే కారణాలు ఉండొచ్చు కానీ మన టాలీవుడ్ స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పిన ఒక విషాద కథ తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యింది. దానిని కొన్నాళ్ల కితం పూరి జగన్నాథ్ తన పాడ్ కాస్ట్ లో వివరించారు. నిజానికి ఆడ, మగ పెంగ్విన్ లలో మగ పెంగ్విన్ తన జోడి పెంగ్విన్ కి చాలా నమ్మకంగా నిజాయితీగా ఉంటుందట. ఒక్కసారి ఒక ఆడ పెంగ్విన్ ని తన భాగస్వామిగా అనుకుంటే అది జీవితంలో చీట్ చెయ్యదని పూరి తెలిపారు. కానీ ఆడ పెంగ్విన్ కానీ చీట్ చేస్తే ఆ బ్రేకప్ ని మగ పెంగ్విన్ తట్టుకోలేదట. దీనితో అది జాతిని, సముద్రాన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయి నించుని నించుని ఆకలితో చచ్చిపోతుందట.

సో ఇది కూడా ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో వృత్తాంతం కూడా కావచ్చు. మరి అన్నేళ్ల కితం వీడియో ఇప్పుడే ఎందుకు వైరల్ అవుతుంది అంటే తమ డిప్రెషన్ కి సింబాలిక్ గా నెటిజన్స్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version