వైరల్ : ప్రభాస్ పై ఈ కొత్త రూమర్స్ అవాస్తవం.!

వైరల్ : ప్రభాస్ పై ఈ కొత్త రూమర్స్ అవాస్తవం.!

Published on Dec 2, 2022 5:04 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాల షూటింగ్స్ లో కూడా ఒకదాని తర్వాత ఒక దానితో మంచి బిజీగా ఉండగా ప్రభాస్ పై రీసెంట్ గానే కొన్ని పెళ్లి రూమర్స్ అయితే వైరల్ గా మారాయి. తర్వాత కృతి సనన్ ఆన్సర్ తో ఈ రూమర్స్ పై అందరికీ క్లారిటీ వచ్చింది. ఇక ఇదిలా ఉండగా మరో పక్క ఇంకో షాకింగ్ రూమర్ అయితే బయటకు వచ్చింది.

ప్రభాస్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో తన ఫామ్ హౌస్ ని మరింత స్థాయిలో విస్తరిస్తూ ఏకంగా 84 ఎకరాలకు చేసాడని వార్తలు పలు కథనాలు బయటకి వచ్చాయి. అయితే అసలు ఇందులో ఎలాంటి నిజం లేదు అన్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఇవి అసలు నిరాధారితం అని వినికిడి. అలాగే నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఈ వార్తలపై మండిపడడం కూడా వైరల్ గా మారింది. మొత్తానికి అయితే ప్రభాస్ పై మళ్ళీ వరుస రూమర్స్ కొనసాగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు