పవన్ – హరీష్ ల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో హీరోయిన్ గా ఆమె ఫిక్స్ ?

Published on Feb 23, 2023 1:06 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 2012లో గబ్బర్ సింగ్ మూవీని తెరకెక్కించారు యాక్షన్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్. బాలీవుడ్ మూవీ దబాంగ్ కి రీమేక్ అయిన గబ్బర్ సింగ్ మూవీ విడుదల తరువాత ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పవన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన గబ్బర్ సింగ్ మూవీ సాంగ్స్, డైలాగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినబడుతూనే ఉంటాయి. ఇక మళ్ళి పదకొండేళ్ల విరామం తరువాత మరొక్కసారి తమ అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేయడానికి సిద్ధమయ్యారు హరీష్ శంకర్.

ఇటీవల గ్రాండ్ గా ప్రారంభం అయిన ఈ మూవీ అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీలో హీరోయిన్ గా యువ నటి పూజా హెగ్డే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. గతంలో హరీష్ శంకర్ తీసిన డీజే, గద్దలకొండ గణేష్ సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు. కాగా ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడంతో తనకు కలిసివచ్చిన పూజానే మరొక్కసారి పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో తీసుకోవాలని డిసైడ్ అయ్యారట హరీష్. అతి త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పనులు జరుగుతున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :