ఆ మూడు అంశాలు హైలైట్ గా నాని ‘దసరా’ ?

Published on Mar 14, 2023 6:54 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన పాన్ ఇండియన్ మూవీ దసరా. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి అందించిన సాంగ్స్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్ అన్ని కూడా ఆడియన్స్ ని నాని ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మార్చి 30న గ్రాండ్ గా ఐదు భాషల్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం లక్నో లో వైభంగా జరగనుంది.

అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం దసరా మూవీ స్నేహం, ప్రేమ, ఎమోషనల్ అంశాలు హైలైట్ గా సాగుతుందని తెలుస్తోంది. సింగరేణి బొగ్గు కార్మికుల జీవితం ఆధారంగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దీనిని మాస్ యాక్షన్ రస్టిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారట. ముఖ్యంగా నాని క్యారెక్టర్ ఈ మూవీలో అదిరిపోతుందని, పలు కీలక సన్నివేశాల్లో నాని, కీర్తి ల యాక్టింగ్ ఆడియన్స్ హృదయాలు తాకుతుందని అని చెప్తున్నారు. మొత్తంగా దసరా మూవీ తప్పకుండా రిలీజ్ తరువాత అందరి అంచనాలు అందుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :