SSMB 28 : వాటిలో ఏమాత్రం వాస్తవం లేదట

SSMB 28 : వాటిలో ఏమాత్రం వాస్తవం లేదట

Published on Mar 17, 2023 12:06 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి సినిమా వస్తుంది అంటే ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. ఇటీవల వరుసగా విజయాలతో దూసుకెళ్తున్న సూపర్ స్టార్ లేటెస్ట్ గా చేస్తున్న మూవీ SSMB 28. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ లో మహేష్ బాబు మంచి మాస్ యాక్షన్ రోల్ లో కనిపిచనున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా పన్నెండేళ్ల గ్యాప్ తరువాత మహేష్ తో చేస్తున్న ఈ మూవీని మంచి ఫ్యామిలీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారట త్రివిక్రమ్.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఈ మూవీ టైటిల్ పై ఇప్పటికే కొద్దిరోజుల నుండి పలు మీడియా మాధ్యమాల్లో టైటిల్స్ ప్రచారం అవుతున్నాయి. అడవిలో అర్జునుడు, అతడే తన సైన్యం, అమ్మ కథ, అతడే పార్థు వంటి టైటిల్స్ అన్ని కూడా పూర్తిగా ప్రచారంలో ఉన్నవి మాత్రమే అని, ఇంకా టైటిల్ ని ఫిక్స్ చేయలేదని, ఒకవేళ ఫిక్స్ అయితే మంచి రోజు చూసి అధికారికంగా అనౌన్స్ చేస్తామని అప్పటివరకు ఇటువంటి అన్ని నమ్మవద్దని టీమ్ వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు