బాలకృష్ణ – అనిల్ రావిపూడి మూవీకి సంబంధించి అది ఫేక్ న్యూస్ అట

Published on Jun 24, 2022 11:30 pm IST

0

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల బోయపాటి శ్రీను తీసిన అఖండ మూవీతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యువ దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ చేస్తున్న భారీ యాక్షన్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీత దర్శకుడు. దసరా సందర్భంగా దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టాక్. అయితే ఈ రెండు మూవీస్ తరువాత క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు బాలకృష్ణ. ఇప్పటికే తామిద్దరి కాంబో మూవీ విషయమై దర్శకుడు అనిల్ రావిపూడి పలు ఇంటర్వ్యూస్ లో వెల్లడించారు.

తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్, ఆడియన్స్ ఆశించే అన్ని రకాల యాక్షన్, కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించనున్నట్లు చెప్పారు అనిల్ రావిపూడి. అయితే ఈ మూవీ లో ప్రముఖ నటుడు రాజశేఖర్ విలన్ గా చేస్తున్నారని ఇటీవల కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో, అది కేవలం ప్రచారం మాత్రమే అని, అసలు విలన్ పాత్ర కోసం తాము రాజశేఖర్ ని సంప్రదించలేదని మూవీ యూనిట్ పక్కాగా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ అతి త్వరలో ప్రారంభం కానుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో దీనిని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం :