“కల్కి” క్లైమాక్స్ లో ఆ ఐడియా కమల్ గారిదే – నాగ్ అశ్విన్

“కల్కి” క్లైమాక్స్ లో ఆ ఐడియా కమల్ గారిదే – నాగ్ అశ్విన్

Published on Jul 10, 2024 2:05 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దర్శకుడు దిశా పటాని (Disha Patani) హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం సెన్సేషనల్ వసూళ్లతో దూసుకెళ్తుండగా ఇందులో భారీ తారాగణం కూడా ఉంది. లోకనాయకుడు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ లాంటి దిగ్గజాలు అత్యంత పవర్ఫుల్ పాత్రల్లో కనిపించారు.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఒకో నటుడికి సెపరేట్ అప్లాజ్ దక్కగా ఉన్న కాసేపు అయినా కూడా కమల్ హాసన్ పోషించిన యాస్కీన్ ఆడియెన్స్ లో ఏ రేంజ్ హై ని అందించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెయిన్ గా ఆ క్లైమాక్స్ పోర్షన్ అయితే ఇక ఐకానిక్ ఎపిసోడ్ అని చెప్పవచ్చు. మరి క్లైమాక్స్ విషయంలో నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు చేసాడు.

క్లైమాక్స్ లో కమల్, విల్లు పట్టుకునే సీన్ లో ఒక పర్టిక్యులర్ పోజ్ పెడతారు. ఆ పోజ్ ఐడియా కమల్ గారిదే అని రివీల్ చేసాడు. మరి కమల్ చేసిన ఆ పరిణితి థియేటర్స్ లో ఇంకా ఎగ్జైట్మెంట్ ని తెచ్చిపెట్టింది. సినిమా విషయంలో కమల్ కి అన్ని రంగాల్లో పట్టు ఉన్న సంగతి తెలిసిందే. తన ఇన్ పుట్స్ కూడా ఈ సినిమాకి కొన్ని ఇచ్చారని టాక్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు