ఆ నమ్మకంతోనే ‘కృష్ణ వ్రింద విహారి’ చేసాము, అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాగశౌర్య

Published on Sep 21, 2022 2:00 am IST

యువ నటుడు నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కృష్ణ వ్రింద విహారి. బ్యూటిఫుల్ హీరోయిన్ షిర్లే సెటియా కథానాయికగా నటించిన ఈ మూవీకి మహతి స్వర సాగర్ సంగీతం అందించగా ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉష మూల్పూరి ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సత్య, వెన్నెల కిశోర్, రాధికా శరత్ కుమార్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ లతో అందరి నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఇక నేడు ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని జేఆర్సి కన్వెన్షన్ సెంటర్ లో ఎంతో గ్రాండ్ గా నిర్వహించగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసి మూవీ సక్సెస్ కావాలని కోరుతూ యూనిట్ కి ప్రత్యేకంగా ముందస్తు అభినందనలు తెలియచేసారు. ఇక హీరో నాగశౌర్య మాట్లాడుతూ, దాదాపుగా రెండున్నరేళ్లుగా కష్టపడి ఈ మూవీ చేసాం అని, ముఖ్యంగా దర్శకుడు అనీష్ కృష్ణ తమ సినిమా కోసం ఎంతో ఓర్పుతో మాతో కలిసి ట్రావెల్ చేసారని, అలానే తన కోసం నెలకొల్పిన తమ సొంతం సంస్థ ఐరా క్రియేషన్స్ పై ఈ మూవీ నిర్మించడం కోసం అమ్మ నాన్న ఒకింత ఆర్ధిక కష్టనష్టాలను సైతం లెక్కచేయకుండా నిలబడ్డారని అన్నారు.

ఇక హీరోయిన్ షిర్లే సెటియా పుట్టింది పెరిగింది న్యూజిలాండ్ లో అయినప్పటికీ కూడా సినిమా విషయంలో తమకి ఎంతో సపోర్ట్ చేసారని, తెలుగు నేర్చుకుని మరీ ఈ మూవీలో సొంతగా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నారని అన్నారు. అయితే మరీ ముఖ్యంగా చెప్పుకోవలసింది ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ గురించి అని, ఫస్ట్ టైం దర్శకుడు అనీష్ ఈ స్టోరీ చెప్పిన తరువాత తప్పకుండా దీనిని ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ఎంత కష్టం అయినా వర్క్ చేయాలని నిర్ణయించాం అన్నారు.

తప్పకుండా ఆడియన్స్ కి ఈ మూవీ నచ్చుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేసారు. ఇక తన తల్లి పాత్రకి రాధికా గారు అయితేనే నేను సినిమా చేయాలనీ నిర్ణయించుకున్నానని, మేము అడగగానే ఒప్పుకున్నందుకు ఆమెకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. సెప్టెంబర్ 23న థియేటర్స్ కి వచ్చి మిస్ అవ్వకుండా కృష్ణ వ్రింద విహారి మూవీ చూడండి మీ అందరికీ ఎంతో నచ్చుతుందని అన్నారు నాగశౌర్య.

సంబంధిత సమాచారం :