రవితేజ ‘ధమాకా’ మూవీకి అది ప్లస్ కానుందా ?

Published on Dec 7, 2022 3:04 am IST

మాస్ మహారాజ రవితేజ తాజా సినిమా ధమాకా పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల కెరీర్ పరంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మాస్ రాజాకు తప్పకుండా ధమాకా మంచి బ్రేక్ అందించడం ఖాయం అంటోంది యూనిట్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలపై ఎంతో భారీగా రూపొందిన ధమాకా మూవీని మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారట దర్శకుడు త్రినాధరావు నక్కిన.

తొలిసారిగా మాస్ రాజా రవితేజతో తన కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ తప్పకుండా అందరి అంచనాలు అందుకుంటుందని ఇటీవల ఇంటర్వ్యూ లో భాగంగా త్రినాధరావు మాట్లాడుతూ చెప్పారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా కార్తీక్ ఘట్టమనేని ఫోటోగ్రఫి అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఒక సూపర్ న్యూస్ టాలీవుడ్ లో క్రేజీ బజ్ ని క్రియేట్ చేస్తోంది. ధమాకా మూవీ రన్ టైం కేవలం రెండు గంటల పది నిమిషాల లోపే అని, ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు ఆడియన్స్ ని సూపర్ గా ఎంటర్టైన్ చేసే ఈ మూవీకి ఇంత తక్కువ నిడివి గల రన్ టైం మంచి ప్లస్ అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఈ మూవీ డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం :